హైదరాబాద్: మెగా ఐపీఎల్ 2020 13వ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ వివరాలను నిర్వాహకులు ఆదివారం అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించారు. గతేడాది ఫైనల్‌లో తలపడిన ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య మార్చి 29న వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరగనుంది. రెండో మ్యాచ్‌ 30న ఢిల్లీ క్యాపిటల్స్‌, కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్‌ జట్ల మధ్య, 31న రాయల్‌ ఛాలెంజర్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య జరగనుంది. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌ తో ఏప్రిల్‌ 1న ఢీకొననుంది. మార్చి 29న ప్రారంభమై మే 24న జరిగే ఫైనల్‌తో ఐపీఎల్ 13వ సీజన్‌ ముగియనుంది. ఈ సీజన్ లో మొత్తం 56 మ్యాచ్‌లు జరగనున్నాయి. శని, ఆదివారాల్లో రెండేసి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మిగతా రోజుల్లో కేవలం ఒక్క మ్యాచ్ చొప్పున మాత్రమే నిర్వహిస్తారు. 2019లో జరిగిన ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించిన ముంబయి ఇండియన్స్ నాలుగోసారి టైటిల్‌ సాధించి చరిత్ర సృష్టించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..